- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు
దిశ, కొత్తవలస: గంజాయి అక్రమ రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. కొత్తవలస సీఐ బాల సూర్యరావు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు తుమ్మకాపల్లి పంచాయతీలోని ఫ్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద గట్టినిఘా ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఉండగా మంగళవారం అరకు నుండి విశాఖపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో నార్త్ ఢిల్లీకి చెందిన ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు 10 కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తూ పోలీసులు కంటపడ్డారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారని తెలుసుకొని తప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని పసిగట్టిన చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వారిపై దాడి చేసి 10 కేజీల గంజాయితోపాటు ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ బాల సూర్యరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిందితులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.