కల్లు డిపోపై పోలీసుల దాడి..సెల్ ఫోన్లు కారు సీజ్

by Aamani |
కల్లు డిపోపై పోలీసుల దాడి..సెల్ ఫోన్లు కారు సీజ్
X

దిశ, భిక్కనూరు : నిషేధిత ఉత్ప్రే రకాలు వాడుతూ, కల్లు తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు కల్లు డిపో పై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో రేణుక దేవి ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న కల్లు డిపో పై దాడి చేసి 50 గ్రాముల అల్ఫాజోలం, 100 గ్రాముల గుర్తు తెలియని రసాయనాల ను పట్టుకోవడంతో పాటు వారి సెల్ ఫోన్లు, కారును సీజ్ చేశారు. డిపో నడిపిస్తున్న మెట్టు సిద్దా గౌడ్, మెట్టు నారా గౌడ్, మెట్టు రాజా గౌడ్, కాసాల బాబా గౌడ్, వారికి వాటిని సప్లై చేసిన ముష్కం వెంకటరమణ గౌడులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed