టమాట ట్రక్కును దొంగిలించిన దంపతుల అరెస్ట్

by Javid Pasha |   ( Updated:2023-07-23 10:40:24.0  )
టమాట ట్రక్కును దొంగిలించిన దంపతుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టమాట ధర ఆకాశాన్నంటడంతో దొంగతనానిని పాల్పడుతున్నారు కొంతమంది. ఈ క్రమంలోనే ఈ నెల 8న కర్ణాటకలో టమాట లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కును ఓ జంట వెంబడించింది. అనంతరం ట్రక్కు డ్రైవర్ ను కొట్టి రెండున్నర టన్నుల టమాటను ట్రక్కుతో సహా తీసుకెళ్లిపోయారు. కాగా తాజాగా టమాట ట్రక్కును ఎత్తుకెళ్లిన ఈ జంటను పోలీసుల వల పన్ని పట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story