రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
X

దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరీంనగర్ మండలము బొమ్మకల్ గ్రామానికి చెందిన భక్తిని అంజయ్య , భార్య అనసూయ బొమ్మకల్ నుంచి శంకరపట్నం మండలం ముత్తారం తన కూతరు ఇంటికి జాతర నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజయ్యకు తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సాయంతో 108 సిబ్బంది ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా స్పందించి కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story