- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు..
దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో గత ఫిబ్రవరి నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని కుమారుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా ఎస్పీ నరసింహ వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ తగాదాలకు సంబంధించి తండ్రి, కొడుకులను హతమార్చడానికి ప్రయత్నించిన షేక్ అసిమ్, అబ్దుల్ అహ్మద్, అబ్దుల్ నవాజ్, ఎండీ రహమత్ పై పీడీ యాక్టు కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఇలా అలజడులు సృష్టించే వారిపైనే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు, హత్యలు, హత్యాయత్నాలకు, మోసాలకు పాల్పడే వారితో పాటు, నకిలీ విత్తనాలు, కల్తీ ఆహార పదార్థాలు, అక్రమ సార, మత విధ్వంసాలు సృష్టించే వారితో పాటు తప్పుడు వార్తలను వైరల్ చేసే వారిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 మందిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగిందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఏఎస్పీ రాములు, డీఎస్పీలు మహేష్, ఆదినారాయణ, మధు, రమణారెడ్డి, టూ టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.