ఆర్టీసీ బస్సు టైరు పేలి ప్రయాణికుడికి గాయాలు..

by Kalyani |
ఆర్టీసీ బస్సు టైరు పేలి ప్రయాణికుడికి గాయాలు..
X

దిశ, బిజినపల్లి: ఆర్టీసీ బస్సు వెనక టైరు పేలడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య సొంత పనుల నిమిత్తం మహబూబ్ నగర్ వెళ్లి తిరిగి సొంత గ్రామానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు.

కాగా బస్సు బిజినపల్లి శివారులోని ఎంజేఆర్ ఫంక్షన్ హాల్ వచ్చేసరికి వెనక టైరు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటనలో బస్సు టైరు భాగంలో కూర్చుని ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 సాయంతో గాయపడిన వారిని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తుండగా మిగతా వారందరూ భారీ శబ్దంతో భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Next Story