- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండోరా పేపర్స్ లీక్ వ్యవహారం.. రూ.30 కోట్ల ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ : పండోరా పేపర్స్ లీక్ వ్యవహారంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విక్రమ్ స్వరూప్, గౌరవ్ స్వరూప్‌ల రూ.30.60 కోట్ల విలువైన సెక్యూరిటీలలోని పెట్టుబడులను సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెలిపింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్‌లోని ఎప్సిలాన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో లాభదాయకమైన యజమానులుగా విక్రమ్ స్వరూప్, గౌరవ్ స్వరూప్ ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఎప్సిలాన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కు జెర్సీ సిటీలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ జె సఫ్రా సరాసిన్ లలో ఉన్న బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించగా.. విక్రమ్ స్వరూప్, గౌరవ్ స్వరూప్ వాటి లబ్ధిదారులుగా ఉన్నారని తేలింది. ఆ ఖాతాల్లో విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఫండ్స్ ను వారు కలిగి ఉన్నారని బహిర్గతమైంది. దీంతో ఎప్సిలాన్ ఎంటర్‌ప్రైజెస్ లో సెక్యూరిటీల రూపంలో విక్రమ్ స్వరూప్, గౌరవ్ స్వరూప్ పెట్టుబడిగా పెట్టిన రూ.30.60 కోట్ల ఆస్తులను గుర్తించి ఈడీ స్వాధీనం చేసుకుంది.