ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఆరిజిన్ డెయిరీ సీఈవో సెజల్

by Javid Pasha |
ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఆరిజిన్ డెయిరీ సీఈవో సెజల్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అరిజిన్ డెయిరీ సీఈవో సెజల్ ఆరోపించింది. ఎమ్మెల్యే మూడు నెలలుగా వేధిస్తున్నారని వాపోయింది. అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం లేదని వాపోయింది. ఎమ్మెల్యే అనుచరులు ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. తననే కాకుండా ఇంకా చాలా మందిని ఎమ్మెల్యే వేధించారని, కానీ అధికార బలంతో ఆ విషయాలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ప్రభుత్వ భూమిని తమకిచ్చి మోసం చేశారని, దళిత బంధు పేరుతో మరో స్కాం చేయాలని ఎమ్మెల్యే చూశారని తెలిపింది. ఎమ్మెల్యే మనుషులకు వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, మంచి జరుగుతుందనే ఎమ్మెల్యే అనుచరులకు వాటాలు ఇచ్చామని తెలిపింది.

ఎమ్మెల్యే చేసిన చాట్ ను బయటపెడితే ఆ నెంబర్ నాది కాదు అని చెప్పి అదే నెంబర్ వాడుతున్నారని పేర్కొంది. తననే కాకుండా తన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భయపెడుతున్నారని సెజల్ ఆరోపించింది. పనులు చేయించుకోవాలంటే తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఎమ్మె్ల్యే అన్నారని, తాను అందుకు నిరాకరించడంతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎంతపోరాటం చేసిన న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశానని, ఢిల్లీలో కూడా తమకు న్యాయం జరగకుండా ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తమకు న్యాయం జరిగేంతవరకు ఢిల్లీ వదిలేదిలేదని, తమ వెనుక ఏ పార్టీవాళ్లు లేరని, తాము ఎవరినీ మోసం చేయలేదని ఆమె తెలిపింది.

Advertisement

Next Story