HYD: ధూల్‌పేట్‌ను జల్లెడ పడుతున్న పోలీసులు

by Gantepaka Srikanth |
HYD: ధూల్‌పేట్‌ను జల్లెడ పడుతున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని ధూల్‌పేట్(Dhoolpet) ఏరియాలో పోలీసుల(Hyderabad Police) ఆపరేషన్ కొనసాగుతున్నది. గతకొన్ని రోజులుగా ధూల్‌పేట్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గంజాయి డెన్‌లపై దాడులు చేస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్(Excise Department) అంజిరెడ్డి నేతృత్వంలో ఈ సోదాలు జరుపుతున్నారు. ఈ దాడుల్లో ధూల్‌పేట్‌ మచిలిపురలో 7.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మరో పక్క ఇంద్రిష్‌ అనే వ్యక్తి నుంచి 1.5 కిలోల గంజాయి, శ్రీనివాస్ అనే వ్యక్తినుంచి 6కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఒకవైపు పోలీసుల విస్తృతంగా తనిఖీుల చేస్తున్నా.. మరోవైపు గంజాయి పెడ్లర్లు వారు పని వారు కానిచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా గంజాయి అమ్మిన కొన్న కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు ఉన్నతాధికారులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి అమ్మి పెడితే భారీగా కమీషన్లు రావడంతో చాలామంది యువత ఈజీగా మనీ సంపాదించొచ్చని లక్ష్యంతో ఈ పనిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత చేదాటకముందే పోలీసులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.

Next Story