road accident : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Sumithra |
road accident : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని వంకాయ గూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్త గ్రామానికి చెందిన పంచ కోటి గోపి (26) తన ద్విచక్ర వాహనం పై మంగళవారం రాత్రి తాడికల్ నుండి కేశవపట్నం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్లూ కోర్టు సిబ్బంది వివరాలను సేకరించారు.

Advertisement

Next Story