- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Accident : రఘునాథపల్లిలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి..
by Kalyani |
X
దిశ, జనగామ,రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెలితే.. మండలంలోని బానాజీ పేట- కల్వలపల్లి గ్రామాల మధ్య బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని డీకొంది. కొలుపుల రాజు పసరమట్ల నుండి కూలీలను తీసుకోని బాణాజిపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం లో బానాజీ పేట గ్రామానికి చెందిన రచ్చ శ్రీహరి (55) మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు, భార్య ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించారు.రచ్చ శ్రీహరి మృతితో బానాజీ పేట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుని జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథ పల్లి పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story