రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
X

దిశ, జగిత్యాల రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన జగిత్యాల - ధర్మపురి వెళ్లే జాతీయ రహదారిపై తిప్పన్నపేట గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిప్పన్నపేట బస్టాండ్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న ఓల్లపు ఐలయ్యను.. అతివేగంతో, అజాగత్తతో ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదలంలో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story