- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
suicide : నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల నారాయణ కళాశాల హాస్టల్ లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి జరిగింది. బొల్లారం సీఐ గంగాధర్, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలంలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఖాజీపల్లి గ్రామ శివారులో నారాయణ కళాశాల హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో 1500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. వరంగల్ జిల్లా అయినవోలు గ్రామానికి చెందిన బాలబోయిన వైష్ణవి (16) ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీ విద్యను అభ్యసిస్తుంది.
కళాశాలలోని 219 గదిలో వైష్ణవి ఉంటుంది. కాగా 315 గది నంబర్ లో రాత్రి 7 గంటల సమయంలో వైష్ణవి ఫ్యాన్ కు చున్ని తో ఊరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో యాజమాన్యం హుటాహుటిన వైష్ణవిని సమీపంలోని ఎస్ ఎల్ జీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్టు సీఐ గంగాధర్ వెల్లడించారు.
గుట్టు చప్పుడు కాకుండా
హాస్టల్లో వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయ్యేలా యాజమాన్యం వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భయాందోళనలో తోటి విద్యార్థులు
వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ లో గల కిటికీల నుంచి విద్యార్థులు బయటకు చూస్తూ తమ తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపించింది. ఇలాంటి ఘటనలు తరచూ నారాయణ కళాశాల హాస్టల్ లో జరుగుతుండడంతో తోటి విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.