Murder: రాష్ట్రంలో మరో దారుణం.. బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య

by Shiva |   ( Updated:2024-12-03 09:00:19.0  )
Murder: రాష్ట్రంలో మరో దారుణం.. బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లా (Warangal District)లోని రంగంపేట (Rangampet)లో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ (Kaktiya Grameen Bank)లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ (Rajamohan) దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా అతడి కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి దుండగులు అతి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై ఉన్న కారులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, నిందితులు పారిపోతున్న దృశ్యాలు అక్కడునున్న సీసీ కెమెరా (CC Cameras)లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed