- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా కొడుకు దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్నాయి కానీ.. కుండబద్దలు కొట్టిన మస్తాన్‌సాయి పేరెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: లావణ్య(Lavanya) - మస్తాన్‌సాయి(Masthan Sai) కేసు రోజూకో మలుపు తీసుకుంటోంది. తాజాగా లావణ్యపై మస్తాన్‌సాయి పేరెంట్స్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం వారు ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘మా అబ్బాయికి పెళ్లి అయినా కూడా.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని లావణ్య వేధించింది. రూ.12 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసింది. మస్తాన్‌సాయి ఫోన్‌లో వందలమంది వీడియోలు ఉన్నాయనే ఆరోపణలో నిజం లేదు. మస్తాన్‌సాయి ఫోన్‌లో న్యూడ్ వీడియోలు తన భార్యవి మాత్రమే ఉన్నాయి.. ఇంకెవరివీ లేవు. మా అబ్బాయి నిర్దోషి, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. లావణ్య వల్లే మా అబ్బాయికి డ్రగ్స్ అలవాటు అయ్యింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని స్వయంగా వాళ్ల అమ్మే చెప్పింది. లావణ్యకు డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వస్తే ముక్కు నేలకు రాస్తాం’ అని లావణ్యపై మస్తాన్‌సాయి పేరెంట్స్(Masthan Sai Parents) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ప్రస్తుతం మస్తాన్‌సాయి రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు అదుపులో ఉన్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు అయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు రాజ్‌తరుణ్ (Raj Tarun) తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు అమ్మాయిల ‘ప్రైవేట్’ వీడియోలు చిత్రీకరించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు.