వివాహిత అదృశ్యం

by Shiva |
వివాహిత అదృశ్యం
X

దిశ, నిజామాబాద్ క్రైం : వివాహిత అదృశ్యమైన ఘటన నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని మాధవ నగర్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాధవనగర్ కు చెందిన సోనీ అలియాస్ లత (23) వివాహిత అదృశ్యమైనట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఈ నెల 22న ఉదయం 5.30కి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదేని తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో లత మామ బొడ్డు నడిపి భాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.

Advertisement

Next Story