ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తి మృతి

by Kalyani |
ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తి మృతి
X

దిశ, దుబ్బాక : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం… రామక్కపేట గ్రామానికి చెందిన అలుమల లింగం (48) అనే వ్వక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న వ్యవసాయ పొలంలో ఓడ్డు చెక్కేందుకు వెళ్తున్నానని తన భార్య చంద్రకళతో చెప్పి ఇంటినుంచి వెళ్లాడు. ఓడ్డు చెక్కేందుకు వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోయేసరికి బావి వద్దకు వెళ్లి చూడగా శవమై తేలుతుండటాన్ని గుర్తించిన మృతుని భార్య రోదిస్తూ స్థానికులకు సమాచారం ఇచ్చింది. చుట్టూ పక్కల వారు రావడంతో వారి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed