లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు

by Shiva |
లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు
X

దిశ, నిజామాబాద్ క్రైం : లారీ, ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయలైన ఘటన జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లి వెళ్తున్న లారీ, కాలుర్ నుంచి కంటేశ్వర్ వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, ఆటో డ్రైవర్ అందులోనే ఇరుక్కు పోయాడు. గమనించిన స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆటోలో నుంచి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story