Prostitution :‘కూకట్ పల్లి గర్ల్స్’ ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు

by Bhoopathi Nagaiah |
Prostitution :‘కూకట్ పల్లి గర్ల్స్’ ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ‘కూకట్ పల్లి గర్ల్స్’(Kukatpally girls) నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వ్యభిచారం(Online prostitution) గుట్టురట్టయింది. కూకట్ పల్లి మెట్రో స్టేషన్(Kukatpally Metro Station), పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో రెయిడ్ చేసిన పోలీసులు పదుల సంఖ్యలో యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా తీగలాగితే డొంక కదిలింది. పోలీసుల కథనం ప్రకారం..

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కూకట్ పల్లి గర్ల్స్’ పేరిట ఓ గ్రూపును క్రియేట్ చేసి దానిలో అందమైన అమ్మాయితో రీల్స్ చేయిస్తున్నారు. వాటిని లైక్స్ కొట్టి కామెంట్ చేసిన వారికి అమ్మాయిలను ఎరవేస్తూ వ్యభిచారం(prostitution) చేయిస్తున్నారు. ఇంతేకాక కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ కింద అమ్మాయిలను నిలబెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. ఇలా గత కొంతకాలంగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల వీరి న్యూసెన్స్ ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కూకట్‌పల్లి సర్కిల్ పోలీసులు, ఎస్‌ఓటీ టీం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి బుధవారం రాత్రి 38 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు ట్రాన్స్ జెండర్లు(Transgenders) ఉన్నారు. అంతేకాక వివాహిత మహిళలూ పట్టుబడ్డారు. వీరందరిని పోలీసులు బైండోవర్ చేశారు. ముఠా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story