బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో BIG ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త తరుణ్ రాజ్ అరెస్ట్

by Gantepaka Srikanth |
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో BIG ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త తరుణ్ రాజ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు(Bangalore Gold Smuggling Case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్‌(Tarun Raj)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ నటి రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసి.. తరుణ్ రాజ్ జ్యువెల్లరీ, హోటల్ వ్యాపారాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రన్యారావు(Ranya Rao) కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, అంతకుముందు రన్యారావును డీఆర్ఐ అధికారులు(DRI officials) కోర్టులో హాజరుపరిచారు. ‘నన్ను డీఆర్ఐ అధికారులు వేధిస్తున్నారు’ అంటూ జడ్జి ఎదుట రన్యారావు బోరున విలపించారు. విచారణ అనంతరం ఆమెకు మరో 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.

కాగా, దుబాయ్(Dubai) నుంచి వస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Bangalore International Airport)లో దిగిన రన్యారావును గత సోమవారం రాత్రి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె నుంచి 14.2 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తరచూ దుబాయ్, అమెరికా సహా పలు దేశాలకు వెళ్లేదాన్ని అని డీఆర్ఏ విచారణలో రన్యారావు అంగీకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో రన్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్(Illegal smuggling network) ఏదైనా ఉందా అనే కోణం నుంచి ప్రస్తుతం డీఆర్ఐ ఆరా తీస్తోంది.

Next Story