- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో ఉన్న మాత శిశు ఆసుపత్రిలో శనివారం ఓ శిశువు మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎన్నంబెట్ల గ్రామానికి చెందిన శ్రీలత నిండు గర్భిణీ. శ్రీలతకు ఇది తొలుసూరు కాన్పు. కాగా కాన్పు కోసం శుక్రవారం రామాపురం గ్రామ సమీపంలో ఉన్న మాత శిశు ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. శుక్రవారం రాత్రి శ్రీలతకు పురిటి నొప్పులు రావడంతో నర్సులకు తెలపగా సరిగా పట్టించుకోలేదు. నర్సులు ఫోన్ మాట్లాడుకుంటూ డిస్టర్బ్ చేయొద్దంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
దీంతో చేసేదేమీ లేక రాత్రంతా శ్రీలత నొప్పులతో అవస్థ పడుతూనే ఉంది. శనివారం ఉదయం నార్మల్ డెలవరీ కాగా ఆడ మృత శిశువు జన్మించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చినప్పుడే వైద్య పరీక్షలు నిర్వహించి సరిగా ట్రీట్ మెంట్ చేసి ఉంటే శిశువు బతికేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్షం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఉన్నతాధికారులు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.