అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. రూ 2.25 కోట్ల విలువగల గంజాయి స్వాధీనం.

by Aamani |
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. రూ 2.25 కోట్ల విలువగల గంజాయి స్వాధీనం.
X

దిశ, ఆదిలాబాద్ : ఆంధ్ర ,ఒరిస్సా బోర్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్దానా ధూలే జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి కంటైనర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు లో ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఉదయం చాకచక్యంగా స్వాధీనం చేసుకుని కంటైనర్ ను మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కంటైనర్ ను తెరిచి చూడగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం పోలిసులు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం కు వెంటనే తెలియ చేశారు. దీంతో తలమడుగు పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ చేరుకొని, స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గంజాయి ని దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్షింపూర్ చెక్ పోస్టు వద్ద ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పోలీసులు పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారని అన్నారు.

అయితే వీరి పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారని, పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఉత్తరాఖండ్ కు చెందిన ఒక ఐచర్ కంటైనర్ వాహనం యు కె08సిబి5318 గలది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళుతుందని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఆ వాహనాన్ని చెక్ పోస్ట్ వద్ద ఆపి తనిఖీ చేయగా అందులో ఒక డ్రైవర్, క్లీనర్ ఉన్నారని అన్నారు.కంటైనర్ వాహనాన్ని తెరిచి చూడగా మొత్తం 292 ప్యాకెట్లు ఉన్నాయని, వాటిని తూకం వేయగా దాదాపు 900 కిలోల వరకు గంజాయి ఉన్నట్లు తెలిసిందని అన్నారు. వీటి విలువ గంజాయి మార్కెట్ ప్రకారంరూ. 2 కోట్ల 25 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.వీరి నుంచి ఐచర్ వాహనం,2మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

Next Story

Most Viewed