హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

by Mahesh |   ( Updated:2022-12-12 14:35:33.0  )
హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. న్యూయర్ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరాకు ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More...

ఇళ్లకు గడియ పెట్టి.. అర్ధరాత్రి బిచ్కుందలో హల్ చల్!

Advertisement

Next Story