- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను హతమార్చిన భర్త..కారణం అదే..
దిశ, బొంరాస్ పేట్ : కట్టుకున్న భార్యను, భర్త మద్యం మత్తులో రోకలిబండతో కొట్టి చంపిన సంఘటన బొంరాస్ పేట్ మండలంలోని ఏర్పుమాళ్ళ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నయీమోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బర్ల పెంటమ్మ (40), బర్ల నర్సిములు (48) భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో (ఆర్థికంగా) తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9గంటలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని, బర్ల నర్సిములు తాగిన మత్తులో భార్య బర్ల పెంటమ్మను (40) రోకలి బండతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న కోడంగల్ సీఐ శంకర్, ఎస్సై నయీమోద్దీన్, పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడు నర్సిములును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నర్సిములు దోమ మండలం, మల్లేపల్లి నుంచి ఇల్లరికం వచ్చాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై నయీమోద్దీన్ తెలిపారు.