మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య

by Kavitha |
మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య
X

దిశ, లోకేశ్వరం : మద్యం సేవించడానికి బానిసైన వృద్ధుడు మద్యం కొనుగోలు చేసేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… గడ్ చందా గ్రామానికి చెందిన ఒలపు ముత్యం (60) తాగుడుకు బానిసై నిత్యం డబ్బుల కోసం భార్యను వేధించేవాడని తెలిపారు. మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడని బుధవారం ఉదయం గడ్ చందా సమీపంలోని గోవింద్ చెరువులో మృతుని శవాన్ని గుర్తించినట్లు తెలిపారు. సంవత్సరం క్రితం ఇలాగే మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలంటూ భార్యని వేధించగా ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. మృతుని భార్య నాగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed