- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nude Photos : ఫొటోస్‌తో Loan APP వేధింపులు.. భార్యాభర్తల షాకింగ్ డెసిషన్
దిశ, వెబ్‌డెస్క్: లోన్‌యాప్స్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారి వేధింపులు భరించలేక రోజూ ఎక్కడో ఒకచోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. మరోచోట లోన్‌యాప్ వేధింపులకు దంపతులు బలయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల క్రితం ఉపాధి కోసం రాజమండ్రి వచ్చాడు. ఆరేళ్ల క్రితం రమ్యలక్ష్మిని వివాహం చేసుకుని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇటీవలే వీరికి డబ్బు అవసరం కావడంతో ఆన్‌లైన్ యాప్‌లో కొంత రుణం తీసుకున్నారు. ఆ రుణం సమయానికి తీర్చకపోవడంతో లోన్ యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో కొంత డబ్బును చెల్లించారు. అయిన వేధింపులు తగ్గలేదు. నీ భార్య ఫొటోలు తప్పుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
దీంతో దుర్గారావు పార్ట్‌టైం డెలవరీ బాయ్‌గా కూడా చేరాడు. ఇంతలో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి తన భార్య న్యూడ్ ఫొటోలు వచ్చాయి. ఫొటోలే కాదు వీడియో కూడా మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు భార్యాభర్తలు. ఇటీవలే పశ్చిమగోదావరిలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఇంటికి వెళ్లకుండా రాజమండ్రిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అనంతరం రాజమండ్రిలోనే ఉంటున్న లక్ష్మి అక్క, బావలకు ఫొన్ చేసి మేము అత్మహత్య చేసుకుంటున్నాం.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఫొన్ పెట్టేసింది. దీంతో ఆ లాడ్జికి వెళ్లి చూసేసరికి అక్కడ దంపతులిద్దరు విషం తాగి పడిపోయి ఉన్నారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read : లోన్ యాప్ లపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం చర్యలు..
Also Read : మొన్న భార్య, నేడు భర్త ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
Also Read : మూడేళ్ల కూతురితో 12 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకిన పోలీస్ భార్య
- Tags
- Loan apps