- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం...
పెట్రోల్ పోయకపోయినా.. పోసినట్లుగా మీటర్ రీడింగ్
డిజిటల్ బిల్ అడిగితే.. నీళ్లు నమిలిన సిబ్బంది
మూకమ్మడిగా నిలదీసిన వినియోగదారులు
దిశ, తూప్రాన్ : ఓ వ్యక్తి తన బైక్ లో పెట్రోల్ లేదంటూ బంక్ కు వెళ్లి పెట్రోల్ కొట్టించాడు. అతను రెండు కి.మీ. వెళ్లాడో.. లేదో.. బండి రిజర్వ్ లో పడిపోయింది. దీంతో అవాక్కైన సదరు వ్యక్తి.. తిరిగి తన స్నేహితుడిన వెంట పెట్టుకుని బంక్ వెళ్లి అక్కడి సిబ్బందిని నిలదీయగా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మనోహరబాద్ మండల పరిధిలోని కుచారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఓ వెంచర్ లో పని చేస్తున్న వ్యక్తి తన బైక్ లో రూ.250 పెట్రోల్ పోయించాడు. ఈ క్రమంలో తాను ఇంటికి వెళ్తుండగా.. రెండు కి.మీ వెళ్లగానే బైక్ రిజర్వు లో పడింది.
అనుమానం వచ్చిన అతను తన స్నేహితుడి సాయంతో బంక్ వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. అందులో తమ పొరపాటు ఏమీ లేదని బంక్ సిబ్బంది బుకాయించారు. పెట్రోల్ పోయించుకున్న వ్యక్తి డిజిటల్ బిల్ అడగ్గా ఎంత వెతికినా ఆ అమౌంట్ తో బిల్ బయటకు రాలేదు. దీంతో ఖంగుతిన్న సిబ్బంది తమదే పొరపాటంటూ వినియోగదారుడిని వేడుకున్నారు. అతడికి మరోసారి రూ.250 పెట్రోల్ పోశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఇలా ఎంత మందిని ముంచుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ లో యథేచ్ఛగా మోసం జరుగుతున్నా.. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం.