- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నాడని పక్క సమాచారం రావడంతో బుధవారం డీఆర్ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో వచ్చిన అంతర్జాతీయ ఓ ప్రయాణికుడు ఇంటర్నేషనల్ డిపార్చర్ వద్ద మరో ప్రయాణికునికి అందించి వెళ్లిపోయాడు.
బంగారాన్ని అందుకున్న ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై వెళుతుండగా విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేసి అతని అరెస్ట్ చేశారు. ఆ ప్రయాణికుడి వద్ద 6 బంగారు క్యాప్సిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి అక్రమంగా తరలిస్తునట్లు గుర్తించారు. ప్రయాణికుని వద్ద కోటి 30 లక్షల విలువ చేసే 2031.35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.