- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాగుడుకు బానిసయ్యాడని సొంత అన్ననే హతమార్చిండు...

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య జరిగింది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.
మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు సమాచారం. సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గన్యా స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కారణంగా కుటుంబంతో సహా మేడ్చల్ కు వచ్చి బతుకుతున్నాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. హత్యకు గురైన వ్యక్తి సంతానంలో రెండో వాడు కాగా హత్య చేసింది చిన్న కుమారుడిగా భావిస్తున్నారు.