- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 సెల్ ఫోన్లు అప్పగింత
దిశ, హుజురాబాద్ రూరల్ : 50 మంది పోగొట్టుకున్న సెల్ఫోన్లను హుజురాబాద్ పోలీసులు కనిపెట్టి బుధవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించవచ్చు అని, దీనివల్ల వ్యక్తిగత సమాచార భద్రత కూడా ఉంటుందన్నారు. మన వివరాలు నమోదు చేసి లాక్ చేయవచ్చని, మొబైల్ దొరికిన తర్వాత అన్ లాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని అన్నారు.
ఇప్పటి వరకు సబ్ డివిజన్ పరిధిలో చాలా మంది ఫోన్లను గుర్తించి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పోగొట్టుకున్న తమ ఫోన్లను కనిపెట్టి పోలీసులు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సెల్ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐలు తిరుమల్ గౌడ్, పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐలు ఓరుగంటి రవి, కిషోర్, ఎస్సైలు తోట తిరుపతి , ఎన్ రాజకుమార్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.