అర్ధరాత్రి వివాహితపై గ్యాంగ్ రేప్.. ఆటోలో సౌండ్ బాక్స్ పెట్టి మరీ అరాచకం

by sudharani |
అర్ధరాత్రి వివాహితపై గ్యాంగ్ రేప్.. ఆటోలో సౌండ్ బాక్స్ పెట్టి మరీ అరాచకం
X

దిశ, వెబ్‌డెస్క్: మన ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్లుగా మారి వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే హనుమకొండ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి ఆటో కోసం చూస్తున్న ఓ మహిళపై గ్యాంగ్ రేపునకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హనుమకొండ జిల్లాలోని నయిమ్‌నగర్ సమీపంలోని నివసిస్తున్న ఓ వివాహిత ఏప్రిల్ 27న బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12 గంటలు అయింది. ఆ సమయంలో కేయూ క్రాస్ రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపారు. తనని రంగ్‌బార్ వద్ద దింపాలని ఆటో డ్రైవర్‌ను కోరగా.. సరేనని ఆ వ్యక్తి వివాహితను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. సగం దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ స్నేహితులైన సనత్, సతీష్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు.

వారిని కూడా ఆటోలో ఎక్కించుకుని మహిళ వెళ్లాల్సిన వైపు కాకుండా వేరే దారికి ఆటోను మళ్లీంచడంతో అనుమానం వచ్చి వివాహిత అరవడం మొదలు పెట్టింది. దీంతో ఆటోలో సౌండ్ బాక్సులు పెట్టి భీమారం గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఒకరితర్వాత మరొకరు ఆ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళను రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న మహిళ బంధువులతో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వాళ్లు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వివాహితకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story