అంతరాష్ట్ర మోటార్‌ బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

by Jakkula Mamatha |
అంతరాష్ట్ర మోటార్‌ బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌
X

దిశ ప్రతినిధి, ఏలూరు: అంతరాష్ట్ర మోటార్‌ బైక్‌ దొంగల ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 25 మోటార్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిశోర్‌ ఈ వివరాలను వెల్లడించారు. గత కొద్ది కాలంగా మోటార్‌ బైక్‌లను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు నిందితులు చోరీ చేస్తూ వచ్చారు. ముగ్గురు నిందితులు పూతి ప్రసాద్ , నడిపూడి.అప్పల నాయుడు, కాపు నాగాంజనేయులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు దిగారని ఎస్‌పీ వివరించారు. వీరిని అరెస్ట్‌ చేసి 17.50 లక్షల విలువైన మోటార్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పీ చెప్పారు.

ప్రధాన నిందితుడు పూతి ప్రసాద్ పై గతంలో ఏలూరు, హనుమాన్ జంక్షన్, తాడేపల్లిగూడెం, తణుకు పోలీస్ స్టేషన్‌లలో పలు దొంగతనం కేసులు నమోదు అయ్యి ఆ కేసులలో అరెస్టై జైలులో కూడా ఉన్నాడని చెప్పారు. మరొక నిందితుడు నడిపూడి.అప్పల నాయుడు గతంలో ఏలూరు మోటార్ సైకిల్ షో రూంలో మెకానిక్‌గా పనిచేశాడన్నారు. కలిదిండి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు, తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఒక కేసు, ముదినేపల్లి ఒకే కేసు, కైకలూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక కేసు, భీమవరం రూరల్ సంబంధించి ఒక కేసులో, ఏలూరు వన్ టౌన్ సంబంధించి ఒక కేసులో, ఏలూరు టూ టౌన్ కు సంబంధించిన 16 కేసులలో మొత్తం 25 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వై వి రమణ , కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ బి రవికుమార్ , ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కలిదిండి ఎస్సై వి వెంకటేశ్వరరావు , ముద్దాయిలను అరెస్టు చేసి మోటార్ సైకిల్ ను రికవరీ చేసిన విషయం పై ఏలూరు జిల్లా ఎస్పీ, కె ప్రతాప్ శివ కిషోర్, అభినందించి ప్రశంసా పత్రాలు , నగదుతో సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed