- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
French woman: మోక్షం పేరుతో కొండపైకి తీసుకుకెళ్లి ఫ్రెంచ్ మహిళపై అత్యాచారయత్నం

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఇజ్రాయెల్ పర్యాటకురాలి పై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే తమిళనాడులో (Tamil Nadu) మరో దారుణం జరిగింది. తిరువణ్ణామలైలో ఓ ఫ్రెంచ్ మహిళపై (French woman) ఓ టూరిస్ట్ గైడ్ లైంగికవేధింపులకు (sexually assaulted) పాల్పడ్డాడు. మోక్షం నిమిత్తం ధ్యానం చేసుకునేందుకు కొండపైకి వెళ్లిన విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న సదరు మహిళ తిరువణ్ణామలై వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేశారు.
కాగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై వివిధ ఆశ్రమాలు, పవిత్ర స్థలాలకు నిలయంగా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే విదేశీయులకు ఇదో గమ్యస్థానంగా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని భావించిన ఫ్రాన్స్ కు చెందిన 46 ఏళ్ల మహిళ 2025 జనవరిలో తిరువణ్ణామలైకి చేరుకుని ఓ ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గత సంవత్సరం కొండచరియలు విరిగిపడిన తర్వాత అధికారులు దీపమలై కొండపైకి ప్రజలను అనుమతి ఇవ్వడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ సదరు మహిళ టూరిస్టు గైడ్ల బృందంతో కలిసి 2,668 అడుగుల ఎత్తైన కొండపైకి చేరుకుంది. అక్కడ ధ్యానం చేయడానికి ఒక గుహలోకి ప్రవేశించింది. అయితే అప్పటికే ఆమె పై కన్నేసిన టూరిస్ట్ గైడ్ వెంకటేశన్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి అసభ్య ప్రవర్తనతో కంగుతిన్న సదరు మహిళ అతడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. కాగా ఇటీవల దేశానికి వస్తున్న విదేశీ మహిళల పట్ల అఘాయిత్యాలు పెరుగుతుండటం ఇండియా టూరిజానికి చెడ్డ పేరు తీసుకువస్తోంది. ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.
Read More..