- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు
దిశ, తాండూర్ : గంజాయి తరలిస్తున్న కేసులో గురువారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గంజాయిని అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తున్నట్లు మాదారం ఎస్సై సౌజన్యకు సమాచారం వచ్చింది. దాంతో మాదారం శివారులో సిబ్బందితో కలిసి ఎస్సై మాటు వేశారు.
షేక్ హసమ్ (తాండూర్), గొర్లపల్లి సందీప్ కుమార్ (తంగలపల్లి), బండారి శ్యామ్ (తాండూర్), విజయ్ హల్దార్ (ఈస్గాం), రాజ్‌కుమార్ (ఈస్గాం) అనే వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద రూ.27, 500 విలువ చేసే ఒక కేజీ 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో వారి వద్ద నుంచి గంజాయి, మోటారు సైకిల్, నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో మాదారం, తాండూర్ ఎస్సై లు సౌజన్య, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
- Tags
- ganja