కొమురం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

by Sumithra |
కొమురం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
X

దిశ, బెజ్జుర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మర్తేడి గ్రామసమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే ఎల్లూరి లింగయ్య, దందర బాబాజీ, భుజాడి బాబాజీ లు బెజ్జూరు మండలం నుండి బొంబాయి గూడలో జరిగే శుభకార్యానికి మోటార్ సైకిల్ పై ఆదివారం రాత్రి వెళుతున్నారు. అదే సమయంలో ఓ ఇసుక ట్రాక్టర్ బెజ్జూర్ నుండి సులుగుపెళ్లి వైపునకు వెళ్తుంది. మార్గమద్యంలో ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.

ఈ ఘటనలో బెజ్జూర్ మండలం తిక్కపల్లి గ్రామానికి చెందిన ఏల్లూరు లింగయ్య (38), మహారాష్ట్ర జంబుగా గ్రామానికి చెందిన దందర బాబాజీ (55) మృతి చెందారు. పాపన్నపేట గ్రామానికి చెందిన బుజాడి బాబాజీ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా బాబాజీని కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కౌటాల సీఐ బుద్ధ స్వామి ఆధ్వర్యంలో, ఎస్సై వెంకటేష్ స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఇద్దరు మృతికి కారకులైన ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed