- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి చేరిన నలుగురు..
దిశ, తాండూరు రూరల్ (తాండూరు ) : కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని దత్తాత్రేయ దైవ దర్శనం కోసం వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెలంగాణ డీజీపీ జితేందర్, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కరన్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రాఘవ కృష్ణ, సంగీత భార్యాభర్తలు అదే విధంగా రాఘవేందర్, భాను ప్రసాద్ అనే మరో ఇద్దరు వ్యక్తులు టీఎస్ 08 ఈపీ 2030 గల వాహనంలో ఘాన్గాపూర్ వెళ్ళుతున్నారు.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనం ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్, మల్టీజోన్ ఐజీపీ సత్యనారాయణ, ఐపీస్ వికారాబాద్, ఎస్పీ నారాయణరెడ్డి, ఐపీస్ ల ఆదేశానుసారం సహాయక చర్యలు చేపట్టేందుకు తెలంగాణ పోలీసులు తరిలారు. ప్రమాద స్థలానికి చేరుకున్న కరన్ కోట్ పోలీసులు అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతి చెందిన వ్యక్తులను బంధువులకు అప్పగించేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. దీంతో క్షతగాత్రులకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు తెలంగాణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.