- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాము కాటుతో రైతు మృతి
దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం పైడి పల్లి గ్రామానికి చెందిన జక్కుల రాజయ్య (52)అనే రైతు శనివారం రాత్రి పాము కాటు తో మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం రాత్రి 9 గంటల సమయంలో పొలానికి వెళ్ళాడు. మోటార్ బంద్ చేసి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కాలికి రక్త పెంజర పాము కాటు వేసింది. పాము కాటు వేసిందని తెలుసుకున్న రాజయ్య హుటాహుటిన ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై ధర్మారం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి సీరియస్‌గా ఉందని చెప్పి కరీంనగర్ వెళ్లాలని సూచించారు.
వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చొప్పదండికి తీసుకెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతడి పేరు మీద సెంటు భూమి కూడా లేనందున రైతు బీమా వచ్చే అవకాశం లేదు. పేరుప్రతిష్టల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అర్ద రాత్రి కరెంటు ఓ రైతు నిండు ప్రాణాలను బలి తీసుకోగా ఆ కుటుంబం వీధిన పడింది.