ఇప్పుడు ఎక్కువ సినిమాలు అలానే వస్తున్నాయి.. నిర్మాతలపై ఈగల్ వింగ్ డైరెక్టర్ సీరియస్

by Gantepaka Srikanth |
ఇప్పుడు ఎక్కువ సినిమాలు అలానే వస్తున్నాయి.. నిర్మాతలపై ఈగల్ వింగ్ డైరెక్టర్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలు(Movies), వెబ్‌ సిరీస్‌(Web Series)లు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఈగల్ వింగ్ డైరెక్టర్ రవికృష్ణ(Eagle Wing Director Ravi Krishna) మండిపడ్డారు. ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ డ్రగ్స్‌ను, స్మగ్లింగ్‌ను ప్రొత్సహించేలా ఉంటున్నాయని.. వాటి వల్లే యువత డ్రగ్స్‌(Drugs) బానిస కావడంతో పాటు చెడుదారిన పడుతున్నారని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసమే ఈగల వ్యవస్థ ఏర్పాటైందని తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా నేరమేనని రవికృష్ణ చెప్పారు. డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలని అభిప్రాయపడ్డారు. ఈ కేసుల్లో దోషులుగా తేలితే ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

రూ.2 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశముందని చెప్పారు. ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని.. కెరియర్ మొత్తం నాశనం అయినట్లే అని అన్నారు. కాగా, ఇటీవల అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప, పుష్ప-2(Pushpa-2 Movie) చిత్రాల్లో హీరో చందనం స్మగ్లర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యాక హీరోపై కూడా విమర్శలు వచ్చాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహించకూడదనీ ప్రభుత్వాలకు ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.

Next Story