తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-21 04:45:29.0  )
తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో డ్రోన్ కెమెరా వీడియో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కొండపై డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వేంకటాచల నాథుడి ఆలయానికి సంబంధించిన డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సోషల్ మీడియాలో ఈ వీడియో ఐకాన్ అనే అకౌంట్ నుంచి అప్ లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు అధికారులు పంపనున్నారు. కిరణ్ అనే వ్యక్తి ఆలయ వీడియోను పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 13న కిరణ్ రెడ్డి ఈ వీడియోను అప్ లోడ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా కిరణ్ రెడ్డి ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఈ వీడియోను డిలీట్ చేసినట్లు పోలీసులు తేల్చారు. అయినా యూట్యూబ్ లో డ్రోన్ షాట్స్ వీడియో కనిపిస్తుండటం గమనార్హం. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed