సంచలన ఘటన.. పట్టపగలే వీధి కుక్కపై అత్యాచారం

by samatah |
సంచలన ఘటన.. పట్టపగలే వీధి కుక్కపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు సమాజం ఏటువైపు వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సమాజానికి షాక్ ఇచ్చేలా ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనం ఈ మధ్య కాలంలో పశువులపై అత్యాచార సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటు చేసుకుంది. వీధి కుక్కలను కూడా వదలడం లేదు కామాంధులు. పట్టపగలే వీధి కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ లోని పాట్నాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాట్నాలో వీధి కుక్కపై హోలీ పండుగ రోజు పట్టపగలే అత్యాచారం జరిగిందని, ఆ ఘటనకు సంబంధించిన వీడియో సిసీ కెమెరాలో రికార్డు అయ్యిందని,పాట్నాలోని పుల్వారీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా జంతు ప్రేమికురాలు ప్రియాధోత్రే ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో అది వైరల్ గా మారింది. భూరి ఫౌండేషన్ అనే జంతు స్వచ్చంద సంస్థ నుండి సదరు మానవ మృగం పై ఫిర్యాదు చేశామని ప్రియా ధోత్రే పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఇది ట్విట్టర్ లో కూడా వైరల్ గా మారింది. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story