రెచ్చిపోతున్న సైబర్ నేరస్థులు

by Shiva |
రెచ్చిపోతున్న సైబర్ నేరస్థులు
X

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో పరిధిలో సైబర్ నేరస్థలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. వ్యాపారం, ఉద్యోగం, లోన్ పేరిట సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సిద్దిపేట వన్ టౌన్ పరిధిలో మటన్ షాప్ యజమానికి ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొన్న సైబర్ నేరస్తుడు ఎక్కవ మొత్తంలో మటన్ కావాలని నమ్మపలికాడు. ఈ మేరకు క్యూఆర్ కోడ్ పంపగా మటన్ షాప్ యజమాని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేశాడు. తొలుత రూ.5 పంపించాడు. తిరిగి స్కాన్ చేయగా మటన్ షాప్ యజమాని బ్యాంక్ ఖాతా నుంచి రూ.11,450 సైబర్ నేరస్థడు కాజేశాడు.

అదే విధంగా మరో బాధితుడికి ఇన్ స్టాగ్రామ్ పేజీ లైక్ చేస్తే బహుమతులు వస్తాయని సైబర్ నేరస్తుడు నమ్మబలికి రూ.2,500 కాజేశాడు. భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడకి పార్ట్ టైం జాబ్ పేరిట నమ్మబలికిన సైబర్ నేరస్థుడు తొలుత డబ్బు చెల్లించాడు. తదనంతరం డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులొస్తాయని తెలిపి బాధితుడి నుంచి రూ.75వేలు కాజేశాడు. మరో బాధితుడని టెలిగ్రాంలో వర్క్ పేరిట నమ్మబలికిన సైబర్ నేరస్థుడు డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కవ డబ్బులొస్తాయని తొలుత రూ.500, తదుపరి రూ.17,800 కాజేశాడు.

దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ ఫైనాన్స్ లో రూ.5లక్షల లోన్ వచ్చిందని నమ్మించిన దుండగుడు ప్రాసెసింగ్ ఫీజ్ పేరిట రూ.20 వేలు కాజేశాడు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బజాజ్ కంపెనీలో లోన్ వచ్చిందని నమ్మపలకి ప్రాసెసింగ్ ఫీజ్ పేరిట బాధితుడి రూ.19,850 కాజేశాడు. మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు లోన్ తీసుకోకపోయినప్పటికీ లోన్ డబ్బు చెల్లించాలని మెసెజ్ లు పంపిస్తూ మీ ఫ్యామిలీ ఫోటోలు ఎడిట్ చేసి మీ స్నేహితులకు పంపిస్తానని సైబర్ నేరగాడు బెదిరించాడు. ఈ ఘటనల్లో బాధితులు 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ..సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story