- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని కుచ్చుటోపీ..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ డిస్కాంట్‌లు, గిఫ్ట్‌ల పేరుతో వలవేసి రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుందని సిద్దిపేట టూటౌన్ పరిధిలో, ఇన్ స్ట్రాగామ్ లో డబ్బులు పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మపలకిన సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తు తెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతది, పాన్ కార్డు వివరాలు, అప్డేట్ చేయాలని ఒక లింకు పంపించాడు.
అది నమ్మిన బాధితుడు లింక్ ఓపెన్ చేసి పాన్ కార్డు వివరాలు, సీవీవీ గడుపు, ఓటీపీ నెంబర్, ఐసీఐసీ క్రెడిట్ కార్డు నెంబర్ నమోదు చేయగానే బాధితుడి అకౌంట్ లో నుండి రూ.1,13,600 డెబిట్ అయ్యాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడు ఇన్ స్ట్రాగామ్ పేజీలో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయని యాడ్ చూసి సదరు నెంబర్ ను ఫోన్ చేశాడు. ఇదే అదనుగా సైబర్ నేరస్తుడు నమ్మపలుకగా బాధితుడు ఫోన్ ఫే ద్వారా రూ.10వేలు పంపించాడు. తరువాత ఆ లింకు ఓపెన్ చేయగా బ్లాక్ చేయబడి ఉంది. ఈ ఘటనల్లో బాధితులు జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మేసెజ్‌లు, ప్రకటనలు నమ్మెుద్దని పోలీస్ కమిషనర్ శ్వేత ప్రజలకు సూచించారు.