- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cyber Crime: ఏసీబీ అధికారినంటూ ఘరానా మోసం.. ఏకంగా తహశీల్దార్‌కు కుచ్చుటోపీ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhongir District)లో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. రాజపేట (Rajapet)లో దామోదర్ (Damodar) అనే వ్యక్తి తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. తాము ఏసీబీ (ACB) అధికారులమని.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నావంటూ తహసీల్దార్‌ను బెదిరించారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ తప్పదని భయపెట్టారు. దీంతో వణికిపోయిన తహశీల్దార్ దామోదర్ ఆన్‌లైన్ ద్వారా పలు దఫాలుగా సైబర్ నేరగాళ్లకు రూ.3.30 లక్షలు పంపాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ (Rachakonda Cyber Crime) పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.