పిడుగుపాటుకు ఆవు మృతి..

by Kalyani |
పిడుగుపాటుకు ఆవు మృతి..
X

దిశ, వంగూరు: పిడుగు పడి ఆవు మృతి చెందిన సంఘటన వంగూరు మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంబాద్ గ్రామానికి చెందిన ఇడమోని శ్రీనివాసులు అనే రైతుకు చెందిన ఆవు వ్యవసాయ పొలంలో మేత మేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆకస్మాత్తుగా పాడి ఆవు మృతి చెందడంతో రూ. 80 వేల నష్టం జరిగిందని రైతు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

Advertisement

Next Story