కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య..

by Sumithra |
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య..
X

దిశ, చైతన్యపురి : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరు ఎస్ఐలు, ఓ హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరువకముందే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే మలక్ పేటలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న జటావత్ కిరణ్ (36) తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి తన స్వంత ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

2014 బ్యాచ్ కు చెందిన కిరణ్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల వలన మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మలక్ పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed