- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘దిశ’ వాట్సాప్ గ్రూపులోకి అక్రమంగా ప్రవేశం.. మోసాన్ని గ్రహించి పోలీసులకు రిపోర్టర్ కంప్లైంట్

దిశ, గద్వాల ప్రతినిధి: సీఐని అంటూ గ్రూప్ అడ్మిన్ సభ్యులను పరిచయం చేసుకొని వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయ్యి.. ఇప్పుడు ఆ గ్రూప్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని ‘దిశ’ పత్రిక విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘దిశ’ గద్వాల నియోజకవర్గం పేరిట వాట్సాప్ గ్రూపు ఉంది. అయితే కొందరు కేటుగాళ్లు పోలీస్ అధికారులం(సీఐ) అంటూ తమను కూడా గ్రూపులో యాడ్ చేయండి అని అడ్మిన్‌ను కోరాడు. తీరా గ్రూపులో చేరాక.. అడ్మిన్ ఇవ్వాలని అన్నాడు. దీంతో చేసేదేంలేక అడ్మిన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత గ్రూపు మొత్తాన్ని వారి గుప్పిట్లోకి తీసుకొని మరికొందరు కేటుగాళ్ల నెంబర్లను అందులో యాడ్ చేసి హర్షసాయి ట్రస్ట్ పేరిట రూ.2000 కడితే రూ.18500 ఇస్తామని నమ్మబలికించారు. అసలు విషయం గ్రహించిన దిశ విలేకరి స్థానిక గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ కళ్యాణ్ కుమార్‌కు కంప్లైంట్ చేశారు. స్పందించిన ఎస్ఐ విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.