చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకున్న.. కోరమండల్ నుంచి బయటపడ్డ వ్యక్తి కామెంట్స్

by Anjali |
చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకున్న.. కోరమండల్ నుంచి బయటపడ్డ వ్యక్తి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలోని ప్రతి ఒక్కరిని కలచి వేసిన సంగతి విదితమే. ఒకే ప్రదేశంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై.. 280 మంది మంది మృతి చెందడం, 500 మందికి పైగా గాయాలవ్వడం ఎంతో బాధాకరమైన ఘటన. అయితే చివరి నిమిషంలో పని పడడంతో రైలు ఎక్కకుండా బాలాసోర్‌కు చెందిన గౌతమ్ దాస్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ బాలాసోర్ నుంచి కటక్ వెళ్లడానికి అతని భార్య విష్ణుప్రియ(22), అత్త, బావమరిది ఆ ట్రైన్‌ ఎక్కడంతో కొద్ది దూరం వెళ్లగానే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గౌతమ్ వెంటనే ఘటన స్థలికి చేరుకున్నాడు. అప్పటికే వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed