షాక్ సర్క్యూట్ తో బట్టల దుకాణం దగ్ధం..

by Sumithra |
షాక్ సర్క్యూట్ తో బట్టల దుకాణం దగ్ధం..
X

దిశ, మల్యాల ; మల్యాల అంగడి బజార్ లోని కేడీసీసీ బ్యాంక్ వైపు గల నటరాజ్ బట్టల దుకాణం షాక్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో బట్టలు స్టాక్ ఉండడంతో మంటలు బట్టలకు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల స్థానికులు బకెట్లతో నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. మంటల తీవ్రత తగ్గకపోవడంతో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆదివారం కావడంతో షాప్ లో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. దుకాణంలో గల బట్టలు, వస్తువుల కాలిపోవడంతో సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.

Advertisement

Next Story