అక్రమ సంబంధం ఎఫెక్ట్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

by Javid Pasha |
అక్రమ సంబంధం ఎఫెక్ట్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
X

దిశ, నేరేడుచర్ల (చింతలపాలెం): తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలపాల్సిన ఓ పోలీస్ రూట్ తప్పాడు. అక్రమ సంబంధం, అక్రమ సంపాదనకు అలవాటుపడి చివరికి దొరికిపోయాడు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో అనంతుల లక్ష్మయ్య అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా అతడిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు అతడు ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సదరు కానిస్టేబుల్ ను డీఐజీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు చింతలపాలెం ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed