- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె దూరం తట్టుకోలేక.. ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగం నిమిత్తం యువతి ఊరుకాని ఊరు వెళ్లింది. ఓ ప్రైవేట్ లాబోరేటరీలో పనిచేస్తోంది. అయితే అదే సంస్థలో పనిచేసే ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అతడు కూడా తమ ప్రాంతానికి దగ్గరి వాడే కావడంతో చనువుగా ఉంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే యువతి తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో అందుకు వారు ఒప్పుకోలేదు సరికదా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చియం చేసేశారు. అప్పటి నుంచి ప్రియుడిని దూరం పెట్టింది. అది తట్టుకోలేకపోయాడు ప్రియుడు. దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్న ప్రియుడికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలియడంతో ఇకకోపంతో తట్టుకోలేకపోయాడు. అంతే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కత్తిపోట్లు వేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో మృతురాలుది కాకినాడ కాగా నిందితుడుది శ్రీకాకుళం జిల్లా కావడం గమనార్హం.
దూరం పెట్టడాన్ని తట్టుకోలేక
కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి(28) బెంగళూరు దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్ అనే వ్యక్తి సైతం పనిచేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇలా ఐదేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం సాగుతుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి ఇంటికి వెళ్లిన లీలా పవిత్ర నీలమణి కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం గురించి చెప్పింది. అయితే కులాలు వేరుకావడంతో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సరికదా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. అనంతరం బెంగళూరుకు వెళ్లిన లీలా పవిత్ర ప్రియుడు దివాకర్ ను దూరం పెడుతూ వచ్చింది. ఇది తట్టుకోలేకపోయాడు. ఎందుకు తనను దూరం పెడుతుందోనని ఆరా తీయగా వేరే వ్యక్తితో లీలా పవిత్ర నీలమణికు పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్నాడు. అంతే కోపంతో రగిలిపోయాడు. మంగళవారం రాత్రి 7:45గంటలకు విధులు ముగించుకుని రూమ్‌కి వెళ్తున్న లీలా పవిత్ర నీలమణి పవిత్రపై దివాకర్ కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు.
కొలిగ్స్ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో కొలిగ్స్ జీవనబీమా నగరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడు దివాకర్ బాణాలను అరెస్ట్ చేశారు. ప్రేమికుడి కత్తి దాడితో తీవ్ర గాయాలపాలైన లీలా పవిత్ర నీలమణిను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.